J.SURENDER KUMAR.
సనాతన దర్మాప్రచారం విసృతంగా జరగాలని…యువతలో హైందవ భక్తి వ్యాప్తి జరగాడానికి కార్యక్రమాలను శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభిస్తాం అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అన్నారు.
తిరుమలలో శ్రీ అన్నమయ్య భవన్ లో మంగళవారం తిరుమల తిరుపతి పాలకవర్గ మొదటి సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలపై చర్చించి చేపట్టాల్సిన పనుల గురించి తీర్మానించుకున్నారు.
👉 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువతి,యవతులు రామకోటి తరహలో గోవిందకోటిని వ్రాసిన వారికి…..వారి కుటుంభసభ్యులకు విఐపి బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేస్తాం
👉 10 లక్షల వెయ్యి 116 సార్లు గోవిందనామాలు వ్రాసిన వారికి దర్శనభాగ్యం కల్పిస్తాం
👉 రాష్ర్టంలోని ఎల్ కేజి నుంచి పిజి వరకు చదివే విద్యార్దులుకు భగవద్గీత సారాంశాని….కోటి పుస్తకాలు పంపిణి చేస్తాం

👉 సెప్టంబర్ 18వ తేదిన ధ్వజారోహణం సందర్భంగా సియం జగన్ మోహన్ రెడ్డి పట్టువస్ర్తాలను సమర్పిస్తారు
👉 2024 సంవత్సరాల డైరిలు, క్యాలండర్లును త్వరలో ప్రారంభిస్తారు
👉 ముంబాయిలోని బాంద్రాలో ₹ 5.35 కోట్లతో టిటిడి సమాచార కేంద్రం…₹ 1.65 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం
👉 ₹ 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పున:నిర్మాణం
👉 ₹ 49.5 కోట్లతో టిటిడి ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మత్తుల పనులకు కేటాయింపు
👉 టిటిడి పోటులో 413 పోస్టులు భర్తికి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి
👉 ₹ 2.46 కోట్లతో టిటిడి ఆసుపత్రులుకు మందులు కోనుగోలుకు అనుమతులు
👉 టిటిడి ఆధ్వర్యంలోని వేదపాఠశాలలో 47 అధ్యాపకులు పోస్టుల అనుమతికి తీర్మానించారు.
👉 వడమాలపేట, వద్ద టిటిడి ఉద్యోగులుకు ఇంటి స్థలాల వద్ద అభివృద్ది పనులకు ₹ 33 కోట్లు కేటాయించారు.
👉 తిరుపతిలోని టిటిడి ఉద్యోగులు నివాసం వుంటున్న కేశవాయనగుంట వద్ద అభివృద్ది పనులుకు ₹ 4.15 కోట్లు కేటాయించారు.
👉 తిరుపతిలోని పురాతనమైన 2,3 సత్రాల స్థానంలో ₹ 600 కోట్ల రూపాయల వ్యయంతో అచ్యుతం,శ్రీపఠం వసతు సముదాయాలను నిర్మాణాలు, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన చర్యలపై తీర్మానించారు.