J.SURENDER KUMAR,
జర్నలిస్ట్, చుక్క గంగారెడ్డి పై జరిగిన హత్యాయత్నం ఘటనలో బుగ్గారం సర్పంచ్ భర్త మూల శ్రీనివాస్ గౌడ్ ను ఎ2 గా చేర్చుతూ ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు. బాధితుడు చుక్క గంగారెడ్డి ఈ దాడి వెనుకాల మరో పది మంది హస్తం కూడా ఉందనే ఆరోపణలతో జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఎస్పీ కి మంగళ వారం ఆయన ఫిర్యాదు చేశారు.
ఏ1 గా చుక్క గంగారాజం, ఏ2 గా మూల శ్రీనివాస్ గౌడ్ లపై సెక్షన్ 294బి, 324, 506 ఆర్ / డబ్ల్యు 34 ఐపిసి ల ప్రకారం కేసు నమోదు చేశారని వివరించారు. మరో పది మంది పాత్రధారులు, సూత్రధారుల సెల్ ఫోన్ ల కాల్ డేటా, కాల్ రికార్డింగ్ ల డేటా వెలికితీసి బాధ్యులైన అందరిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించాలని ఆయన జిల్లా కలెక్టర్ ను, జిల్లా ఎస్పీ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు .