పెద్ధపెల్లి పార్లమెంట్ ఇంచార్జ్ జోషి !
J.SURENDER KUMAR,
ఈ నెల 17 న హైదరాబాద్ లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో సోనియా గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొననున్న విజయ భేరి సభను విజయవంతం చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ జోషి కార్యకర్తలు నాయకులకు విజ్ఞప్తి చేశారు.
బుధవారం ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘ భవనంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఏర్పాటు చేసిన కార్యకర్తలు సమావేశంలో మాట్లాడారు.
ధర్మపురి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని, రాష్ర్టంలో కెసీఆర్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాచరికపు పాలనకు చరమగీతం పాడి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా సోనియా గాంధీ విజయభేరి సభ నిర్వహించనున్నట్లు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు సార్లు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం ఇస్తే మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను, అప్పుల రాష్ట్రంగా మార్చడం జరిగిందనీ అన్నారు. నిరుద్యోగ సమస్యలు , రైతుల సమస్యలు , నీటి సమస్యలు ,విద్యార్థుల సమస్యలు ఏమి తీరలేదని, రాష్ట్ర ఏర్పడిన తర్వాత అభివృద్ధి జరిగింది అంటే కేవలం లిక్కర్ షాప్స్ లోనే తప్ప మరే రంగంలో అభివృద్ధి అనేది లేదన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి నాయకులు, మద్దెల రవీందర్, గజ్జల స్వామి, కుమారస్వామి తదితరులతో పాటు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్, ధర్మారం మండల పార్టీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, పెగడపల్లి మండల పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, పిసిసి వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి, ఎల్డిఎం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీకాంత్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందెని మొగిలి, ధర్మారం మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మన్సుక్,.ఆవుల వేణు,.బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కుంట సుధాకర్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫియోద్దిన్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, మరియు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..