మంత్రి కొప్పుల ఈశ్వర్!
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా లో 15 గ్రామ పంచాయతీలకు జాతీయస్థాయి అవార్డులు రావడం శుభ పరిణామమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా గ్రామాల స్థితిగతులు మారుతున్నాయని, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి అన్నారు.
స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్ – 2023 జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కార్యాలయాల సమీకృత సముదాయాల సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతీ నెల గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం ద్వారా, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. తద్వారా దేశానికే ఆదర్శవంతమైన గ్రామాలుగా కీర్తి సంపాదిస్తున్నాయని అన్నారు. మున్ముందు కూడా ఇదే కృషితో ప్రగతి సాధించి ఉత్తమ స్థానాలుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతి రాజ్ చట్టాన్ని తీసుకువచ్చి గ్రామ అభ్యుదయానికి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.

గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని నేడు మనం అనుభవిస్తున్నామని అన్నారు. భావి తరాల వారికీ మంచి వాతావరణం అందించడం కోసం గ్రామాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. వంద శాతం ఇంటిపన్ను వసూళ్ళ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. ఇటీవల కేంద్ర పరిశీలకుల బృందం జిల్లాలో పర్యటించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఇదే స్పూర్తితో సర్పంచులు, గ్రామీణాభివృద్ది అధికారులు పని చేసి జాతీయ స్థాయి అవార్డులు సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. వచ్చే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను నెలకొల్పి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
శాసన మండలి సభ్యులు ఎల్. రమణ, కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్, జగిత్యాల నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్రావ్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి నరేష్, గ్రామీణాభివృద్ది అధికారులు, సిబ్బంది, పంచాయతి కార్యదర్శులు, ఎం.పి.టి.సి.లు, సర్పంచులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.