J.SURENDER KUMAR.
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ధర్మపురి పట్టణానికి చెందిన భోగ శివప్రసాద్, శీలం రాజేష్ లను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరి ఎంపిక పట్ల ఉపాధ్యాయ సంఘాలు,పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా ఎంపీక చేసిన 28 మంది ఉపాధ్యాయులలో 13 మంది స్కూల్ అసిస్టెంట్లు/ హెచ్ఎంలు, కాగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 4, ఎస్జీటీలు,/ పండితులు 11 మంది ఉన్నారు. శీలం రాజేష్, బీర్పూర్ మండలం రేకులపల్లి పాఠశాల SGT గా విధులు నిర్వహిస్తున్నారు. భోగ శివప్రసాద్, సారంగాపూర్ మండలం అర్పపల్లిలో భాషా పండితుడుగా కొనసాగుతున్నారు.


జగిత్యాల్ పట్టణంలోని పొన్నాల గార్డెన్స్ లో మంగళవారం ఉపాధ్యాయులకు సన్మానం, పురస్కారం ప్రధానం చేయనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటనలో పేర్కొన్నారు.