ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ !
J.SURENDER KUMAR.
నూతన ఓటరు నమోదు, జాబితాలో సవరణల కొరకు అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఆదేశించారు.
సోమవారం హైదరాబాదు నుండి సంయుక్త ఎన్నికల అధికారులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు అందిన దరఖాస్తుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ
👉.ఎస్. ఎస్. ఆర్. 2023 లో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలి.18, 19 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
👉 పోలింగ్ కేంద్రాలు, లింగ నిష్పత్తి వారీగా దరఖాస్తు ఫారాలను పరిశీలించి ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ , షేక్ యాష్మిన్ భాషా, జిల్లా అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు దివాకర, రెవిన్యూ బిఎస్ లత సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
నూతన ఓటర్ నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించడంతో పాటు ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
👉 గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ట్రాన్స్ జెండర్లు, ఆదివాసి పెద్దలతో తరచుగా సమావేశాలు నిర్వహించి ఓటరు నమోదు తో పాటు ఓటరు జాబితాలో సవరణలపై ప్రజలను చైతన్యపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
👉 దివ్యాంగులు, వయోవృద్ధులను ఓటరు జాబితాలో ప్రత్యేక మార్కింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. జనాభా, లింగ నిష్పత్తి ప్రకారంగా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.
👉 కళాశాలలలో 18, 19 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఓటరు జాబితాలో చేర్చే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ సమీక్షలో sveep నోడల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవోలు జగిత్యాల నరసింహమూర్తి, కోరుట్ల ఆర్డిఓ రాజేశం సంబంధిత ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు