ఓటర్ల సవరణ పారదర్శకంగా నిర్వహించాలి!

మునిసిపల్ రాష్ట్ర కార్యదర్శి సుదర్శన్ రెడ్డి !


J.SURENDER KUMAR,

రెండవ ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు నిర్వహించాలని ఓటరు జాబితా పరిశీలకులు, మునిసిపల్ పరిపాలన, పట్టణ అభివృధి కార్యదర్శి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు.

రెండవ ప్రత్యేక ఓటరు నమోదు 2023 లో భాగంగా మంగళవారం జగిత్యాల జిల్లాలో ఆయన పర్యటించారు.


కలెక్టర్ కార్యాలయ సముదాయంలో జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర లు పరిశీలకులకు స్వాగతం పలికారు.

చిన్నాపూర్ లో

జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమాలు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం పట్టణంలోని జగిత్యాల పట్టణంలోని163 వ పోలింగ్ కేంద్రం, బుగ్గారం మండలంలోని చిన్నపూర్ గ్రామంలోని 57 వ పోలింగ్ ధర్మపురి మండలం

ఆక్స్ సాయిపల్లెలో

ఆక్సాయపల్లెలోని 45 వ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఓటరు నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపు లకు సంబంధించిన రికార్డుల పరిశీలించి, వివరాలను సంభందిత బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలకుల వెంట ఆర్డీఓ నరసింహ మూర్తి, తహశీల్దార్లు నరేష్ , మాజిద్, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.