జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా !
J.SURENDER KUMAR,
ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించాలని, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల కమీషన్ ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అన్నారు.
ఎన్నికల నిర్వహణ సిబ్బందితో.
శనివారం కలెక్టర్ కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ టీం లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు ప్రశాంతంగా ఎలాంటి సమస్యలకు తావులేకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ప్రవర్తన నియమావళిని అనుసరించి విధులు నిర్వహించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టె విధంగా విధులు చేపట్టరాదని సూచించారు.

ఎన్నికల నోటిఫికేషన్…
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, ఆయా సంబంధిత టీం లు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల విధులపై ప్రతీ ఒక్కరు అవగాహన, ప్రతీ అంశం తెలిసి ఉండాలని అన్నారు. సకాలంలో నివేదికలు సమర్పించాలని సూచించారు.
1950 టోల్ ఫ్రీ నంబర్…
భారతీయ పౌరులెవరైనా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నంబర్ కు తెలియజేయవచ్చని, అట్టి సమ్మతమైన ఫిర్యాదును పరిష్కరించవలసి ఉంటుందని తెలిపారు.
డబ్బు పట్టుబడితే…
అనధికారికంగా డబ్బు, ఇతర వస్తువులు రవాణా చేస్తున్నట్లయితే వాటిని పట్టుకుని నిబంధనల మేరకు చర్యలకు ప్రతిపాదించాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది సమన్వయంతో సమిష్టి కృషితో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సజావుగా నిర్వహించాలని అన్నారు.
సోషల్ మీడియాలో పాల్గొన రాదు..
అంతకుముందు కొరుట్ల ఆర్దిఓ రాజేశ్వర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే అంశాలపై ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని సూచించారు. ఎన్నికల సందర్భంలో అనధికారికంగా రవాణా జరుగుతున్న డబ్బు, ఇతరాత్ర సరుకులు, వస్తువులు వంటి వాటిని సీజ్ చేయడం జరుగుతుందని, అట్టి వాటిని సాక్ష్యాధారాలతో నిరూపించిన పక్షంలో సదరు వాటిని రిలీజింగ్ కమిటి మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, మాస్టర్ ట్రైనర్ తిరుపతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.