ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ను అడ్డుకున్న పోలీసులు !

J SURENDER KUMAR,

మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ను, భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి వెళ్లారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.

శ్రీధర్‌బాబుతో పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలను నిలిపివేశారు. దీంతో బ్యారేజీ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపు ఆందోళనలు కొనసాగాయి. అనంతరం ఎమ్మెల్యేను సందర్శనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, నా ప్రాంతాన్ని నేను తిరగడాని అడ్డుకోవడం ఏమిటి ? అని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కొంతమేర కుంగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీ సామర్థ్యంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వంతెన 20వ పిల్లర్ బేస్​మెంట్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది.