👉డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం ధర్మపురి లోనీ స్థానిక శ్రీలక్ష్మి నరసింహ గార్డెన్స్ నియోజకవర్గ స్థాయి బూత్ ఎజెంట్ల సమన్వయ సమావేశం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంఛార్జి మోహన్ జోషి, మరియు జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, అసెంబ్లీ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ ఆద్వర్యంలో బూత్ ఏజెంట్లు నిర్వహించవల్సిన విధులు మరియు నియోజక వర్గంలో పార్టీ గెలుపుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఏజెంట్లకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటింటికీ తీసుకెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ధర్మపురి నియోజక వర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన అభివృద్ధి ఏమి లేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు తప్ప అర్హులైన పేద వారికి ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జితేందర్, పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు సుధాకర్, ఎంపిటిసి తిరుపతి, సర్పంచ్ సత్యనారాయణ, మురళి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, ధర్మపురి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగిలి, వెల్గటూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, పెగడపెల్లి మండల యూత్ అధ్యక్షుడు అనిల్, ధర్మారం మండల యూత్ అధ్యక్షుడు మహిపాల్, బుగ్గారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, గొల్లపెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, టౌన్ యూత్ అధ్యక్షులు తిరుపతి, టౌన్ అధ్యక్షులు మహేష్, అసెంబ్లీ NSUI అద్యక్షులు శ్రవణ్, నాయకులు, కార్యకర్తలు,పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు