J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ పరిధి వెల్గటూర్, పెగడపల్లి, ఎండపల్లి మండలాల నుండి మంగళవారం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి స్వాగతించారు.

తాళ్ళకొత్త పేట గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కొల లచ్చయ్య, పెద్ద పున్నం, గుండ మహేందర్, తిరుపతి రెడ్డి, గుండ బక్కయ్య, అయిట్ల తిరుపతి, రాజయ్య, గుండ లచ్చయ్య, ధర్మాజి రమణ, రాజయ్య, గుమ్ముల రవి, గంజాగి గోపి, ఓరుగంటి సత్తయ్య, బదం సత్తి రెడ్డిలు చేరారు.

ఇదే మండలంలోని శాలపల్లి, చేగ్యాం గ్రామాలకు చెందిన పలువురు యువకులు, పార్టీలో చేరారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. గ్యారెంటీల ను వివరించి ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు..

కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపతి, నదయ్య, చెన్న పున్నం, అయిట్ల రవి ,అనుమాండ్ల శ్రీను, నడిమెట్ల పోషయ్య, దూడ రవి తదితరులు పాల్గొన్నారు

ఎండపల్లి మండలం రాజారాం పల్లె, ఉండేడ గ్రామాలకు చెందిన యువకులు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోపాల్ రెడ్డి,

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, చేగ్యం ఎంపిటిసి తిరుపతి, పున్నం, అసెంబ్లీ అధికార ప్రతినిధి విజయ్, సర్పంచ్ లచ్చయ్య, రమేష్, లక్ష్మణ్, గెల్లు శ్రీను, వెంకట స్వామి, పాలోజు శ్రీనివాస్, మహేష్, సాయి, సంజీవ్, అశోక్, సుశీల్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

పెగడపల్లి మండలం లింగపూర్ సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ తిరుపతి ఆద్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు నందగిరి బి.ఆర్.ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు శేఖర్, తన అనుచర గణంతో కాంగ్రెస్ లో చేరారు. వీరిని లక్ష్మణ్ కుమార్ స్వాగతించారు.

ఈ కార్యక్రమంలో పెగడపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, ఒరిగల శ్రీనివాస్, లింగాపుర్ సర్పంచ్ శంకర్, ఎంపిటిసి తిరుపతి, భాస్కర్, రాజేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గ మాత కు ప్రత్యేక పూజలు!

దేవి నవరాత్రుల సందర్భంగా ఎండపెల్లి మండలం రాజరాం పల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గమాత ను లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మణ్ కుమార్ కు అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని అందించి సన్మానించారు