కాంగ్రెస్ లోకి జగిత్యాల జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ !

👉 ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ సమక్షంలో..


👉 ధర్మపురి అసెంబ్లీలో బీఆర్ఎస్ కు షాక్ !


J.SURENDER KUMAR,

భారతరాష్ట్ర సమితి, సీనియర్ నాయకుడు, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు, వందలాది మంది తన అనుచరుగణం తో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలో మాజీమంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ సమక్షంలో తన అనుచర గణంతో చేరనున్నట్టు ఆయన తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో 2006లో టిఆర్ఎస్ పార్టీలో చేరి నేటి వరకు ఆ పార్టీలో కొనసాగారు.
2001 లో గొల్లపల్లి మండల జెడ్పిటిసి సభ్యుడిగా..2006 లో స్వతంత్ర ఎంపీటీసీలు గా తన అభ్యర్థులను గెలిపించుకొని. 2006 లో తన భార్య ను గొల్లపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు చేయడంలో విజయం సాధించారు.

1995 లో సింగల్ విండో చైర్మన్ గా కొనసాగారు. 2006 నుంచి నేటి వరకు పార్టీలో చంద్రశేఖర రావు కొనసాగారు. ఆయనకు జూనియర్ కేసీఆర్ అనే నిక్ నేమ్ ఉంది. 2017 లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చంద్రశేఖర రావును జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించారు. దాదాపు మూడు సంవత్సరాలుగా పదవిలో కొనసాగారు. 2018 ఎన్నికల్లో ధర్మపురి బీ ఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటమికి, ప్రత్యర్థి గెలుపుకు చంద్రశేఖర రావు కుట్రకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.