జగిత్యాలలో కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్!

👉త్వరలో మరిన్ని బలగాలు…


జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్.


J.SURENDER KUMAR,

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు బుధవారం జగిత్యాల పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. త్వరలో మరిన్ని BSF బలగాలు రానున్నాయి అని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

బుధవారం జిల్లా కేంద్రంలో 300 మంది జిల్లా పోలీస్, కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ కవాతును ఎస్పీ జెండా ఊపి ప్రారంబించారు. ఫ్లాగ్ మార్చ్ ఓల్డ్ బస్టాండ్, తహసిల్ చౌరస్తా, టవర్ సర్కిల్, తీన్ ఖని, కిలగడ్డ ,గంజ్ రోడ్డ్ ప్రాంతాలలో నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో స్వేచ్చాయుత గా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్పీ అన్నారు. ఫ్లాగ్ మార్చ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పట్టణాల్లో సైతం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా రెండు BSF కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లా కి రావడం జరిగింది అనీ త్వరలో మరో ఆరు కంపెనీల కేంద్రం సాయుధ బలగాలు జిల్లాకు రావడం జరుగుతుందని అన్నారు.

ఫ్లాగ్ మార్చ్ లో అడిషనల్ ఎస్పీ లు ప్రభాకర రావు, భీం రావ్, BSF అసిస్టెంట్ కమాండెంట్లు దిపకార్, సునీల్ కుమార్ , డిఎస్పీలు రవీంద్ర కుమార్, వెంకటస్వామి, రవీంద్ర రెడ్డి, ఇన్స్పెక్టర్లు నటేశ్,.కోటేశ్వర్ ,రమణమూర్తి , ఆరిఫ్ అలీ ఖాన్ , ఆర్.ఐ లు వేణు ,రామకృష్ణ, జనిమియా ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, BSF సిబ్బంది పాల్గొన్నారు