ప్రగతి భవన్​లో ఘనంగా దసరా పండగ వేడుకలు.!

J.SURENDER KUMAR,

దసరా పండగ వేడుకలు ప్రగతి భవన్​లో సోమవారం ఘనంగా జరిగాయి. దసరా పండగ ను పురస్కరించుకొని  ప్రగతి భవన్ ప్రాంగణంలో ఉన్న నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ కుటుంబ సమేతంగా, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్​, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శమీ పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా జమ్మి చెట్టుకు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్విహంచారు. అనంతరం సీఎం కేసీఆర్​ కుటుంబానికి విజయాలు సిద్ధించాలని వేద పండితులు, పూజారులు ఆశీర్వదించారు.


శుభసూచకంగా భావించే పాలపిట్టను కేసీఆర్​ దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం.. దసరా నాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షును తో  కలసి సీఎం పాల్గొన్నారు. అనంతరం పండితులు నిర్వహించిన సాంప్రదాయంగా చేసే ఆయుధ పూజలో పాల్గొన్నారు. సీఎం కుటుంబ సభ్యులకు పండితులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి.. అనంతరం ఆశీర్వదించారు
.