J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో బుధవారం కాశెట్టి వాడకు చెందిన పలువురు మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరినట్టు వారు వివరించారు.

13.వ వార్డు (కాశెట్టి వాడ) లో బండారి రంజిత్, చల్ల రవి, చల్ల అశోక్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు తమ వార్డు అభివృద్ధి ని కాంక్షిస్తూ చేరినట్టు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలిపారు