సీఎం అభ్యర్థిగా ఈటల రాజేందర్… ?

👉సూర్యాపేట సభలో అమిత్ షా ప్రకటన ?

👉తెలంగాణలో బెంగాల్ ఫార్ములా !

J. SURENDER KUMAR,

శుక్రవారం సాయంత్రం సూర్యాపేటలో జరగనున్న బిజెపి ఎన్నికల సభలో హోం మంత్రి అమిత్ షా , ఈటెల రాజేందర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటన చేస్తారు అనే చర్చ మొదలైంది.

బీఆర్ఎస్, బిజెపిలు ఒక్కటే, వారివి  కుమ్ముకు రాజకీయాలు, బండి సంజయ్ ను  అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, పార్టీని వీడుతున్న బిజెపి నాయకులు, చేస్తున్న  లిక్కర్ కుంభకోణంలో అరెస్టులు తదితర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న  బిజెపి అగ్రనాయకత్వం. ఆ ఆరోపణలకు చెక్ పెట్టే దిశగా బిసి, ( ముదిరాజ్) సామాజిక వర్గానికి చెందిన  ఈటెల రాజేందర్ పేరు ప్రకటించనున్నట్టు చర్చ నెలకొంది.
దీనికి తోడు  జరగనున్న ఎన్నికల్లో  ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ అసెంబ్లీతోపాటు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లోను రాజేందర్ పోటీకి పెట్టడం సీఎం అభ్యర్థి ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నది.
మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, . ఏనుగు రవీందర్ రెడ్డి తదితర నాయకులు బిజెపి పార్టీని వీడి ఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్ లో చేరడం, లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారని, టిఆర్ఎస్ పార్టీ ని ఢీకొట్టేది బిజెపి పార్టీ అనుకున్నాను, కానీ అలా జరగలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియ  సమావేశంలో వెల్లడించడం విశేషం.
బిజెపి మరియు భారాసలు దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యం, కెసిఆర్ గవర్నర్ పట్ల సచివాలయం లో ప్రదర్శించిన గౌరవ మర్యాదలు, కొంతమంది బిజెపి నాయకులకు మింగుడు పడడం లేదు. వారంతా కెసిఆర్ మీద వ్యతిరేకతతో బిజెపి లో చేరినవారే తప్ప, సిద్ధాంతపరంగా చేరినవారు కాదు. ముఖ్యంగా ఈటెల అనుచరులు భారాస, మరియు బిజెపిల మధ్య ఇదే వైఖరి కొనసాగే పక్షంలో కాంగ్రేస్ లో చేరి కెసిఆర్ ను ఓడించాలని హుజురాబాద్ లో ఆయన అనుచర గణం ఈటెల పై ఒత్తిడి తెస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం బిజెపి అధిష్టానం వద్ద ఉందని చర్చ


👉ముందస్తుగా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా ?
ఈ పరిణామాలను  గమనిస్తున్న బిజెపి అధిష్టానం ఈటెలను బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీలో అంతర్గతంగా తలెత్తే సమస్యలు, రానున్న పార్లమెంటు ఎన్నికల అవసరాలు, జరుగబోయే అవకాశాలను నిశితంగా గమనిస్తున్నారు. గతంలో ముందస్తుగా సీఎం అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయానికి బిజెపి పార్టీ కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ ఢిల్లీ ఎన్నికల్లో శ్రీకారం చుట్టింది. ఇటీవల అస్సాంలో హేమంత బిస్వా ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటిస్తూఎన్నికలకు వెళ్లింది.
👉 ఉద్యమ నేతగా గుర్తింపు.. బీసీ కార్డు !

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం కే చంద్రశేఖర రావు ల సామాజిక వర్గ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలు ఒ వెనుకబడిన తరగతి నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశాలు లేవు.
రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా, ప్రతి గ్రామంలో గుర్తింపు కలిగిన నాయకుడిగా రాజేందర్ కు గుర్తింపు ఉంది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బీసీ నాయకుడు, బండి సంజయ్ ను మార్చి ఆ స్థానంలో కిషన్ రెడ్డి కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించా రు  అనే అపవాదు కొనసాగుతున్న నేపథ్యంలో  ఈటెల ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే బిజెపికి రాజకీయంగా కొంతమేర ఊరట లభిస్తుంది అనే చర్చ .
👉బిసి నాయకులు, ఓటర్లు బిజెపి వైపు ? మొగ్గవచ్చు. రెండు పార్టీల్లోని అసంతృప్తులు బిజెపిని బలపరచవచ్చు. ఎన్నికల సమయంలో అంతర్గతంగా రెండు పార్టీల్లోని బిసి సామాజిక వర్గం ఈటెల గెలుపుకు సహకరించవచ్చు. బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం, దీనికి తోడు సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో బీసీలకు 23 శాతం సీట్లు కేటాయించడం. ముదిరాజులకు, ఆ జాబితాలో స్థానం లేకపోవడం , తదితర అంశాలను ఎన్నికలలో అస్త్రలుగా, బిజెపి సీఎంగా బీసీ అభ్యర్థి నీ ప్రకటించి కాంగ్రెస్, బీఆర్ఎస్ ల ను ఉక్కిరి బిక్కిరి చేసే యత్నంలో బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుందనేది చర్చ.
బీజేపీ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా నియమించిన బిజెపి అధిష్టానం,. ఆయన భద్రతకు అదనంగా కేంద్ర బలగాల ను కేటాయించడం గమన హారం.
👉బెంగాల్ సీఎం మమతను ఓడించిన విధంగా బిజెపి ఫార్ములా .?
పశ్చిమ బెంగాల్లో సీఎం మమత బెనర్జీ తో 1998 నుంచి వెన్నంటి ఉన్న ప్రధాన అనుచరుడు, సువెందు అధికారినీ, బిజెపి పార్టీలో చేర్చుకొని మంచి ఫలితాలు సాధించింది.  సీఎం మమతా బెనర్జీ పై 2020 లో సిలిగురి లో పోటికి నిలిపి ఆమెను ఓడించింది. బిజెపి నాయకత్వం తెలంగాణలోను సీఎం కేసీఆర్, ప్రధాన అనుచరుడు రాష్ట్ర సాధన ఉద్యమంలో వెన్నంటి ఉన్న, ఈటల రాజేందర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి సీఎం కెసిఆర్ ప్రాతినిత్యం వహిస్తున్న గజ్వేల్ లో కెసిఆర్ పై పోటీకి  పెట్టి వచ్చే రాజకీయ పరిణామాలను బేరీజు వేస్తున్నట్లు భోగట్టా.