👉 జగిత్యాల నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం!
👉 జగిత్యాల న్యూ బస్టాండ్ చౌరస్తాలో సభ!
👉 ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఏఐసిసి మాజీ అధ్యక్షులు ఎంపి రాహుల్ గాంధీ, మరియు ప్రియాంక గాంధీ ఈనెల 18 న. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నట్టు పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

ఈ నెల 18న జగిత్యాల జిల్లా నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం రోజున ఏఐసిసి కార్యదర్శి బస్సు యాత్ర కార్యక్రమం ఇంచార్జ్ సుశాంత్ మిశ్రా, శుక్రవారం జగిత్యాల లో పర్యటించారు..అంతకు ముందు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం, జిల్లా నాయకులతో కలిసి రోడ్ షో, సభ నిర్వహించనున్న న్యూ బస్ స్టాండ్ కూడలిని సుశాంత్ మిశ్రా పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మీడియాతో మాట్లాడారు.

రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరేసే విధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆద్వర్యంలో చేపట్టనున్న బస్సుయాత్ర ప్రచార కార్యక్రమం జగిత్యాల జిల్లా నుండి ప్రారంభించడం జిల్లా నాయకత్వంలో ఎనలేని ఉత్సాహాన్ని నింపినట్లుగా భావిస్తున్నామని అన్నారు.
ఈ నెల 18న మధ్యాహ్నం రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని సాయంత్రం న్యూ బస్టాండ్ కూడలి వద్ద జరిగే సభలో పాల్గొంటారని తెలిపారు.
సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.