J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణం పటేల్ చౌరస్తాలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి, జగిత్యాల్ చాంబర్ ఆఫ్ కామర్స్, బాధితుడి చిన్ననాటి మిత్రులు, ధర్మపురి వాసవి మాత ఫ్యామిలీ కిట్టి గ్రూప్ సభ్యులు ఆదివారం ₹ 1.85 లక్షలు బాధిత కుటుంబానికి అందించారు. అగ్నిప్రమాదంలో మహంకాళి రాధాకృష్ణ _ శ్వేత దంపతులకు సంబంధించిన చిన్న కిరాణ. దుకాణం కాలిపోయి ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలారు.

చిన్ననాటి మిత్రులు.₹ 1.13 లక్షలు!
బాధితుడు రాధాకృష్ణ చిన్ననాటి మిత్రులు స్పందించి ₹ 1,13 లక్షల చెక్ అందించారు. ఉపాధ్యాయ సంఘం( TPUS ) జగిత్యాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ప్రసాదరావు కోరారు ఇట్టి కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు బోయినపల్లి ప్రసాదరావు, బద్రీనాథ్ ,GL కుమార్ మహేష్, రమేష్ ,ప్రసాద్, సతీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ ₹ 55 వేలు !
చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ₹ 55 వేలు నగదును వారు జగిత్యాల నుంచి వచ్చి బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ మాజీ వర్తక సంఘ అధ్యక్షులు, యెరవల్లి సురేష్ , వర్తక సంఘం అధ్యక్షులు కమటాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెద్ధి శ్రీనివాస్, కోశాధికారి కప్పల శ్రీకాంత్, లతో పాటు FMCG జిల్లా అధ్యక్షులు ఊటూరి నవీన్, జిల్లా హోల్సేల్ మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి గరిపెల్లి సంపత్ కుమార్, వర్తకసంఘం కార్యవర్గ సభ్యులు పాల్తెపు భూమేష్ మరియు జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పబ్బ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఊటూరి ప్రభాకర్ తోపాటు, డీసీఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు PCC సభ్యులు సంఘనపట్ల దినేష్ , తదితరులు పాల్గొన్నారు.
వాసవి మాత ఫ్యామిలీ కిట్టి గ్రూప్ ₹ 20, వేలు!

స్థానిక వాసవి మాత ఫ్యామిలీ కిట్టి గ్రూప్ సహాయంగా ₹ 20,000/- అందించారు. ఈ కార్యక్రమంలో మురికి శ్రీనివాస్, కూరగాయల సంతోష్, కూరగాయల రమేష్, గునిశెట్టి శ్రీనివాస్, చౌడారం సతీష్, దైత శ్రీనివాస్, నలుమాసు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.