👉 రాష్ట్ర ప్రభుత్వం- ప్రకటించే పీఆర్సీ లో అంగన్ వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం !
👉మధ్యాహ్న భోజనానికి సంబధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేసిన ప్రభుత్వం !
J.SURENDER KUMAR,
అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం తన నివాసానికి వచ్చిన అంగన్వాడీ హెల్పర్స్ యాక్షన్ కమిటీ, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులకు మంత్రి హరీశ్‌రావు వివరించారు.
మధ్యాహ్న భోజనాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేసినట్టు ప్రకటించారు. అంగన్వాడీల ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై తొందరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ నిర్ణయం వల్ల 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులకు లాభం చేకూరుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అంగన్వాడీల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.