J.SURENDER KUMAR,
పేదలు ఆత్మ గౌరవం తో డబుల్ బెడ్ ఇండ్లలో జీవించాలన్నది సీఎం కేసిఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
ధర్మపురి పట్టణం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ₹130.80 లక్షల వ్యయంతో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూం ఇండ్లను గురువారం ప్రారంభించి, లబ్దిదారులకు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..
గూడు లేని నిరుపేదలకు సకల సౌకర్యాల తో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లో ఆత్మ గౌరవంతో జీవించాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వప్నమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.