బెంగళూరులో ఐటీ దాడులు ₹ 42 కోట్లు పట్టివేత!

👉పట్టణంలో పది చోట్లు కొనసాగుతున్న దాడులు !


J. SURENDER KUMAR

బెంగళూరులో ఐటి  అధికారులు దాడులలో ఓ మాజీ కార్పొరేటర్​ బంధువు ఇంట్లో మంచం కింద ₹.42 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు డబ్బులు వసూలు చేశారన్న సమాచారంతో కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐటి  దాడులు చేపట్టింది. బెంగళూరులోని కాంట్రాక్టర్లు, జ్యువెలరీ షాప్ యజమానులు, ప్రస్తుత, మాజీ బీబీఎంపీ కార్పొరేటర్​ ఇళ్లలో సోదాలు జరిపింది. ఈ దాడిలో ₹.42 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మాజీ కార్పొరేటర్​ ..?
ఆర్‌టీ నగర్‌.. ఆత్మానంద కాలనీలో నివాసం ఉంటున్న ఓ బీబీఎంపీ మాజీ మహిళా కార్పొరేటర్​ బంధువు​ ఇంట్లో ₹ 42 కోట్లు దొరికినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి.

గురువారం సాయంత్రం నుంచి పోలీసు సిబ్బందితో వచ్చిన ఐటి అధికారులు.. మాజీ కార్పొరేటర్​ బంధువు​ ఇంట్లో తనిఖీలు నిర్వహించి పెట్టెల్లో ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సర్జాపుర్ సమీపంలోని ముల్లూరు, ఆర్‌ఎంవీ ఎక్స్‌టెన్షన్, బీఈఎల్ సర్కిల్, మల్లేశ్వరం, డాలర్స్ కాలనీ, సదాశివనగర్, మట్టికేరి సహా పదికి పైగా చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.