బీజేపీ- బీఆర్ఎస్ ఇద్దరూ తోడు దొంగలే  కాంగ్రెస్ కు వారంటీ లేనిదే తెలంగాణ ఇచ్చిందా ?

👉 ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

J.SURENDER KUMAR,

బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలేనని.. మోడీ.. కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే.. నీతి.. నియమం లేని నాయకులు.. సమయానుకూలంగా ఎవరితోనైనా కలుస్తరని విమర్శించారు.
జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


జీవన్ రెడ్డి మాటల్లో..

👉 బీజేపీ.. టీఆర్ఎస్ రెండు ఒక్కటేనని లోకమంతా తెలుసు.. 2018 వరకు కేంద్రంలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును సీఎం కేసీఆర్ సమర్ధించారు.
బీజేపీని బిఆర్ఎస్ విభేదించింది ఎప్పుడు.. అది నుండి బీజేపీతో దోస్తీయే కదా..


👉 గ్యారంటి, వారంటీ లేని కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందా.? మహిళలకు ఉచిత వడ్డీ రుణ సౌకర్యం కల్పించిందా..? అర్హతకు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేపట్టిందా..?  మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ చేసినమా.108,104 ప్రవేశపెట్టిన మా..గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన మా.. లక్ష రూపాయల రుణమాఫీ చేసిందా.?


👉 సమాచార హక్కు చట్టం.. ఉపాధి హామీ చట్టం.. విద్యా హక్కు చట్టం తెచ్చింది కాంగ్రెస్ కాదా. విశ్వసనీయతకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ…


👉 గత ఎన్నికల్లో యావర్ రోడ్డు విస్తరణ ప్రధాన అంశంగా మారింది. సంబంధిత శాఖ మంత్రి కావడంతో పరిష్కారం చూపిస్తారని భావిస్తే, ఆ అంశమే ప్రస్తావించకపోవడం ఆశ్చర్చకరం.
👉 2017లో 100ఫీట్ల రోడ్డు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే నాలుగు ఏళ్లు నాన్చి, అమలుకు చర్యలు తీసుకోకుండా, చట్టబద్ధంగా పరిహారం చెల్లించేదిశగా చర్యలు చేపట్టకుండ యావర్ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయే వారికి పరిహారం చెల్లించకుండ టీడీఆర్ తెరపైకి తీసుకువచ్చారు. యావర్ రోడ్డును గత ఎన్నికల్లో ప్రధాన అంశం చేశారు కదా.. పరిష్కారం కోసం రూ.100కోట్లు ప్రకటించలేదు..


👉 నర్సింగాపూర్, అంబారిపేట, హస్నాబాద్, తిప్పన్నపేట, తిమ్మాపూర్, మోతె గ్రామాల భూముల రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయేవిధంగా ఆంక్షలు విధిస్తే రైతులను చైతన్య పర్చడం తప్పా.. మాస్టర్ ప్లాన్ పట్టణానికి పరిమితమై యావర్ రోడ్డు 100ఫీట్లు విస్తరణ చేస్తే ఎవరు వద్దంటున్నారు…


👉 రాష్ట్రంలో జిల్లాగా ఏర్పాటు చేసే అన్ని వసతులు, అర్హతలు ఉన్నది మొదటిది జగిత్యాల, జగిత్యాల జిల్లాను చిన్నగా చూడటం ఏమిటని ప్రశ్నించారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా ఏ రాష్ట్రంలోనైనా జిల్లాలు ఏర్పాటు చేయడం సహజం. పాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేసి, జగిత్యాల జిల్లా ఏర్పాటు
చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని, జగిత్యాల జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం లేదా.?. అర్హత లేదా ?  ప్రశ్నించారు. ములుగు, భూపాలపల్లి, అసిఫాబాద్, నారాయణ పేట్ జిల్లాలుగా ఏర్పాటు చేసినప్పుడు ఒకప్పుడు జగిత్యాల సబ్ డివిజన్లో భాగంగా ఉన్న సిరిసిల్ల కన్నా జగిత్యాల ఏవిధంగా తీసిపోయిందో మంత్రి కేటీఆర్ చెప్పాలి.33జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తుందడంలో భాగంగా జగిత్యాలకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు…


👉 కరీంనగర్ జిల్లా వాస్తవ్యుడిగా రాష్ట్రానికి రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా సేవలు చేసే అవకాశం రావడంతో ఉమ్మడి రాష్ట్రానికి ఒకే ఒక్క జేఎన్టీయూ కళాశాల మంజూరైతే అది జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసినం. వ్యవసాయ కళాశాల జగిత్యాలలో ఏర్పాటు చేసినం. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు రీజినల్ కేంద్రాన్ని జగిత్యాలలో ఏర్పాటు చేసినం..


👉 కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటు చేసినం.


👉 అవకాశం ఉన్న ప్రతి చోట రోడ్లు వేసినం. రాజీవ్ రహదారి హైదరాబాద్ నుండి మంచిర్యాల రూపకల్పన నా ఆలోచన విధానం. కరీంనగర్ బైపాస్ రోడ్డు వేసినం. సిరిసిల్ల పట్టణానికి బైపాస్ రోడ్డు, జగిత్యాలలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసినం..


👉 కాలువలకు మోటార్లు పెట్టించామని చెప్పుకోవడం హాస్యాస్పదం. కాలువలకు మోటార్లు ఎవరు పెట్టారో తాటిపల్లి గ్రామానికి వెళ్లి రైతులను అడిగితే తెలుస్తుంది. ప్రధాన కాలువకు మోటార్లు పెట్టామని చెప్పుకుంటున్న మంత్రి కేటీఆర్ కాలువకు ఎవరు పెట్టిందో పాత్రికేయ సోదరులు పరిశీలించాలని కోరారు… సర్వీస్ కనెక్షన్ ఎప్పుడు తీసుకున్నారో పరిశీలిస్తే మోటార్లు ఎవరు పెట్టించారో తెలుస్తుందని.. మంత్రి కేటీఆర్ మాట మాట్లాడితే అంతూపొంతూ ఉండదని ఎద్దేవా చేశారు.


👉 ఉచిత విద్యుత్ అమలు తలపెట్టినప్పుడు మంత్రి కేటీఆర్ నువ్వు ఎక్కడ ఉన్నావని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మెట్ట ప్రాంతం కావడంతో అధికశాతం రైతులు వ్యవసాయ బావులపై ఆధారపడి సాగు చేస్తుండడంతో ఎన్నికల ప్రణాళికలో పేర్కొని,
దేశంలోనే మొట్టమొదటి సారిగా ఉచిత విద్యుత్ ఫైలుపై మొదటి సంతకం చేశారని, అప్పుడు మంత్రి కేటీఆర్ అమెరికాలో ఉన్నారని అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం 2008-09లో ఇళ్ల నిర్మాణాలకు ఆలోచన రూపకల్పన చేసిన..


👉 4000 మంది నిరుపేద వర్గాలను గుర్తించి, ఒక్కొక్కరికి 100 గజాల కేటాయించి, ఇల్లు మంజూరు చేసినం. వివిధ దేశాల్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయినవి పూర్తిచేయకుండ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికి ఇంటి నిర్మాణ వ్యయంతోపాటు స్థల సేకరణ కూడా చేపట్టినం.


👉 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒక్క గుంట భూమి సేకరించారా అని ప్రశ్నించారు…


👉 ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో గృహ నిర్మాణం కోసం స్థల సేకరణ చేసి, ఇళ్ల నిర్మాణం కోసం స్థలం అందుబాటులో ఉండడంతో డబుల్ బెడ్ రూం ఇళ్లనిర్మాణం చేపట్టడం వాస్తవామా.. కాదా..
👉 ఉమ్మడి రాష్ట్రంలో నిలిచిన పోయిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తే కాంగ్రెస్ పేరు వస్తుందని, 1600 ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాల్సినబాధ్యత ప్రభుత్వంపై లేదా.. నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు రూ. 3లక్షలు ఇస్తే, నిర్మాణం పూర్తిచేసే అవకాశం ఉంది. వివిధ దేశాల్లో నిలిచిన 1600 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేందుకు నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్రెడ్డి, మండలాధ్యక్షుడు జున్ను రాజేందర్, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, గుంటి జగదీశ్వర్, వీసీసీ ఎ సెట్ కన్వీనర్ చాంద్పౌషా, జిల్లా కాంగ్రెస్ కార్మికవిభాగం అధ్యక్షుడు బొల్లి శేఖర్, వేణు, మహిపాల్, నరేశ్ పాల్గొన్నారు.