👉 కాంగ్రెస్ ను నిలదీయండి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు.!
👉 బుగ్గారం మండల కార్యకర్తల సమావేశంలో
👉మంత్రి కొప్పుల ఈశ్వర్
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్రం లో బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన, అణగారిన వర్గాల వారి కోసం చేపట్టని పధకాలు ఏంటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ప్రజలు నిలదీయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

బుగ్గారం మండలంలో సోమవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గొని కార్యకర్తలకు దశా దిశా నిర్దేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం గట్టాలని కోరారు. గ్రామ గ్రామాన బీఆర్ఎస్ ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. పెద్దలలో పెద్దగా.. చిన్నలలో చిన్నగా ఉంటున్నానని చెప్పుకోచ్చారు. 30 ఏళ్లుగా పగటి పూట నిద్ర పోవడం మానేశానని,.. నా జీవితం మొత్తం ప్రజల కోసమే బతుకుతున్నానని చెప్పారు.

నియోజకవర్గం అభివృద్ది, ప్రజల క్షేమమే నాకు కావాలన్నారు. ఇందుకు మీ వంతు సహాయంగా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్రజల క్షేమన్ని పట్టించు కోలేదాన్నారు. రైతు బంధు, రుణ మాఫీ, దళిత బంధు పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని..

ఎవరూ నమ్మ వద్దు అని చెప్పారు. ఈ సమావేశం లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, బుగ్గరాం జెడ్పిటీసి బాధినేని రాజేందర్, ఎంపిపి రాజమణి, మండల బీఆర్ ఎస్ అధ్యక్షుడు మహేష్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, గ్రామ శాఖల అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.