బిఎస్పి నుంచి బిజెపిలో చేరికలు !

J.SURENDER KUMAR,

జగిత్యాల అసెంబ్లీ పరిధిలో నీ సారంగాపూర్ మండల్ రేచపెళ్లి గ్రామానికి చెందిన బస నాగేంద్ర ఆధ్వర్యంలో BSP పార్టీ మండల అధ్యక్షులు ఎరుకొండ వెంకటేష్ తో సహా 50 మంది యువకులు ఆదివారం భారతీయ జనతా పార్టీ లో చేరారు.

జగిత్యాల బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బోగ శ్రావణి, వీరికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ లో చేరినట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఎండబట్ల వరుణ్ కుమార్, రామసేన యూత్ అధ్యక్షులు పెంచాల తిరుపతి తదితరు యువకులు పాల్గొన్నారు.