J.SURENDER KUMAR,
బుగ్గారం మండల కేంద్రంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని బుధవారం జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా స్థానిక మండల నాయకులతో కలిసి పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తానని ముఖ్యమంత్రి కెసిఅర్ హామీ ఇచ్చి,ఇప్పుడు హామీని విస్మరించారని, ఒక మంత్రి హోదాలో ఉన్న కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గానికి, బుగ్గారం మండలానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని, లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
తాను దళిత బందును ఆపుతున్నానని మండలానికి చెందిన నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేవలం అర్హులైన పేదవారికి మాత్రమే దళితబందు ఇవ్వాలని మేము డిమాండ్ చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నర్సగౌడ్, మండల యూత్ అధ్యక్షుడు తిరుపతి, చిన్న నర్సగౌడ్, కుమ్మరి రాజన్న, నగునూరి శ్రీనివాస్,.బిసగోని వినోద్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ అంజిత్, విజయ్, రాజు, అన్షరీఫ్, కైలాసం, కొడిమ్యాల రాజన్న, శ్రీధర్ మండల కాంగ్రెస్ పార్టీకి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
పెగడపల్లి మండలం కాంగ్రెస్ పార్టీలో చేరికలు!

పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో వివిధ కుల సంఘాలకు చెందిన పలువురు కుల పెద్దలు, మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బుధవారం రోజున జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్, ఒరిగల శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ ప్రవీణ్, రాజేందర్, శ్రీరామ్ అంజయ్య, బలరాం రెడ్డి, సత్తి రెడ్డి, మహేందర్, బండారి శ్రీనివాస్, లక్ష్మిరాజం తదితరులు పాల్గొన్నారు