సీఎం కేసీఆర్ ధర్మపురి పర్యటన సభా స్థలం పరిశీలన !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ధర్మపురి పర్యటన సందర్భంగా ధర్మపురి పట్టణంలో జరుగు సభా స్థలి, హెలిప్యాడ్, వి ఐ పి పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు సభా స్థలికి వచ్చి వెళ్లే దారులు, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను, సోమవారం జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. అనతరం బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.


అనంతరం ధర్మపురిలో ఎన్నికల నామినేషన్ సెంటర్ ను పరిశీలించి ఏర్పాటు చేయవలసిన బందోబస్తు గురించి అధికారులకు సూచన చేశారు. ఎస్పీ వెంట డిఎస్పి లు వెంకట స్వామి,రవీంద్ర కుమార్, SB ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు,సి.ఐ రమణమూర్తి, ఎస్.ఐ దత్తాత్రి ఉన్నారు.