J.SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరును ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించిన సందర్భంగా ఆదివారం ధర్మపురి లొ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

కాంగ్రెస్ శ్రేణులతో కలిసి లక్ష్మణ్ కుమార్ స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

రాయపట్నం కూడలి నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో యువకులు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు, అనంతరం రాయపట్నం, బూరుగుపల్లే , తిమ్మాపూర్ స్టేజీల వద్ద ప్రజలు స్వాగతించి టపాసులు కాల్చారు. అంబేద్కర్ చౌరస్తా, నంది కూడలి, గాంధీ కూడలి, పోలీస్ స్టేషన్ , తెనుగు వాడ మీదుగా ఆలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా మద్దూనూర్ గ్రామానికి చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందేని మొగిలి,

నాయకులు కస్తూరి శ్రీనివాస్, ఆశెట్టి శ్రీనివాస్, ఓజ్జల లక్ష్మణ్, వెలగటూర్ సర్పంచ్ మురళి, ఉప సర్పంచ్ సందీప్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రావు, వెంకటేష్, నరసింహులు, పురుషోత్తం, సర్పంచ్ సత్యనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు

పెగడపల్లి మండలంలో గడపగడపకు కాంగ్రెస్ !

పెగడపల్లి మండలం దివికొండ,ల్యాగలమర్రి, రామభద్రుని, ఎల్లాపూర్, కీచులాటలపల్లి, గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.

ముందుగా దేవి కొండ గ్రామంలోని మల్లన్న దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సుమారు పలువురు యువకులు గ్రామస్థులు లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు .. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, ఒరిగల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అద్యక్షులు అనిల్, మల్లారెడ్డి, ఎంపిటిసి తిరుపతి, టౌన్ యూత్ అధ్యక్షులు ప్రవీణ్, శేఖర్, భాస్కర్, జితేందర్, డైరెక్టర్ మల్లేష్, గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్, రాకేష్, గ్రామ శాఖ అధ్యక్షులు మల్లారెడ్డి, కల్లపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు