👉డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
దళిత బందు పథకంను బిఆర్ఎస్ బందుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మార్చారని, మంత్రి కేవలం బిఆర్ఎస్ నాయకులకు మంత్రిగా వ్యవహరిస్తున్నరా ,? లేక రాష్ట్ర ప్రజానికానికి మంత్రిగా వ్యవహరిస్తున్నారా ? జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను (దళిత బంధు,బిసి బందు,మైనార్టీ బందు,గృహలక్ష్మి) లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి పారదర్శకంగా చేపట్టాలని, రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిపి, బ్యాంకు రుణాలు సక్రమంగా మంజూరు చేయాలని

కోరుతూ సోమవారం ధర్మపురి తహసిల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులతో లక్ష్మణ్ కుమార్ ధర్నా నిర్వహించి. తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ లో చేరికలు..

ధర్మపురి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సుమారు 30 మంది యువత లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కుంట సుధాకర్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందెని మొగిలి,.అసెంబ్లీ NSUI అధ్యక్షుడు శ్రావణ, టౌన్ యూత్ అధ్యక్షులు తిరుపతి, పట్టణ బిసి సెల్ అధ్యక్షులు లక్ష్మణ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు భుమేష్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీయొద్ధిన్, సీపతి సత్యనారయణ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, అసెంబ్లీ యూత్ జనరల్ సెక్రటరీ దేవవరం, టౌన్ కాంగ్రెస్ అద్యక్షుడు మహేష్, స్తంభం కాడి గణేష్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్ , గొల్లపెల్లి మండల NSUI అధ్యక్షుడు రాకేష్, అశేట్టి శ్రీనివాస్, ప్రశాంత్, గణేష్, శరత్ శేఖర్, నిరంజన్, లక్ష్మణ్, తిరుపతి, మల్లేష్,.గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్, రమేష్, పురుషోత్తం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు