👉ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ ఏర్పడిన అనంతరం ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని గుర్రంపొడి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కెసిఆర్ ప్రభుత్వం ను నిలదీశారు.

మంగళవారం ధర్మారం పట్టణం, మండలంలో నీ బంజరుపల్లి, పెరుకపల్లి, మల్లాపూర్, మేడారం, బోట్లవనపర్తి, ఖిలావనపర్తి, గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చేపట్టారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
మండలంలోని గ్రామాల్లో ఎంత మంది పేదవారికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇచ్చారో ? మంత్రి సమాధానం చెప్పాలని, డిమాండ్ చేశారు.

పేదవారికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేని మంత్రి కొప్పుల ఈశ్వర్ తాను ఉండటానికి మాత్రం ₹ 2 కోట్లతో క్యాంపు ఆఫీస్ కట్టుకున్నారని, మిల్లర్ల క్వింటాలుకు 5 నుండి 10 కిలోల వరకు కటింగ్ పేరిట దోపిడీ చేస్తున్న మంత్రి కనీసం స్పందించలేదని, ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ₹5 వందలకే సిలిండర్, రైతులకి క్వింటాలుకు అదనంగా ₹ 500 రూపాయల సహాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు,ప్రతి మహిళకు చేయూత కింద ₹ 4వేల రూపాయల ఆర్థిక సహాయం, రేషన్ కార్డులను పంపిణీ నిరంతరంగా కొనసాగింపు,

ఏక కాలంలో ₹ 2 లక్షల రుణమాఫీ వంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు