ధర్మపురి అభివృద్ధిలో  మాజీ మంత్రి రత్నాకర్ రావు కృషి అభినందనీయం !

👉డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

పుణ్యక్షేత్రమైన ధర్మపురి అభివృద్ధికి. స్వర్గీయ మాజీమంత్రి జువ్వడి రత్నాకర్ రావు అభివృద్ధి పనులే మినహా మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసింది ఏమీ లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

ధర్మపురి  పట్టణంలో ఆదివారం పలు వార్డులో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ముందు స్థానిక శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామినీ  దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా. లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
సాగు.నీరు అందిస్తానని ,శాశ్వత మంచి నీటి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి,అట్టి హామీని మంత్రి కొప్పుల ఈశ్వర్ మరిచారని ఆరోపించారు.  ధర్మపురి ప్రజల కష్టసుఖాలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అధికారులకు వచ్చిన వెంటనే అమలు చేస్తామని ధర్మపురి ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.


చేరికలు..
ఈ సందర్భంగా దొనూర్ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు.కార్యకర్తలు, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


రామయ్య పల్లెలో ఘన స్వాగతం!
గడపగడప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి రామాయపల్లె లో పలువురు నాయకులు కార్యకర్తలు లక్ష్మణ్ కుమార్ ను స్వాగతించి పూలమాలతో సన్మానించారు.


ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్, కౌన్సిలర్ లు జక్కు పద్మ రవీందర్ ,కౌన్సిలర్ నాగలక్ష్మి రాజేష్, కౌన్సిలర్  గరిగే అరుణ రమేష్, కౌన్సిలర్ సంతోషి దినేష్, 

నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు సుధాకర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజేష్, ఆర్యవైశ్య సంఘ నాయకుడు జక్కు రవీందర్, మాజీ  వార్డు సభ్యులు సంగనభట్ల నరేందర్ , ఓజ్జల నరేందర్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందేని మొగిలి, సిపతి సత్యనారయణ, ఓజ్జల లక్ష్మన్, టౌన్ యూత్ అధ్యక్షులు తిరుపతి, టౌన్ కాంగ్రెస్ అద్యక్షులు మహేష్, మల్లేష్, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పోచయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు భూమేష్, ఆశేట్టి శ్రీనివాస్, మండల బిసి సెల్ అధ్యక్షులు మల్లేష్, సుముక్, చిలుముల లక్ష్మణ్, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు