J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ 98 రోజుల హుండీ ఆదాయం ₹ 39, 69, 104/- ( ముప్పది తొమ్మిది లక్షల, 69 తొమ్మిది వేల,104 రూపాయలు) ఆదాయం వచ్చింది.
మిశ్రమ బంగారం 95 గ్రాములు, మిశ్రమ వెండి 5 కిలోలు 100 గ్రాములు మరియు, విదేశీ నోట్లు (36) వచ్చాయని కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో నిఘా నీడలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.
కరీంనగర్ దేవాదాయశాఖ సహాయ కమీషనర్, చంద్రశేఖర్ పర్యవేక్షణలో రెనోవేషన్ కమిటీ ఛైర్మెన్ ఇందారపు రామన్న,

సభ్యులు గందె పద్మ శ్రీనివాస్, అక్కెనపెల్లి సురేందర్, వీరవేని కొమురయ్య, చుక్క రవి, స్తంభంకాడి మహేష్. ఇనగంటి రమా వేంకటేశ్వర్ రావు, గునిశెట్టి, రవీందర్, పల్లెర్ల సురేందర్, గుంపుల రమేష్, వేముల నరేష్, జైన రాజమౌళి , దేవస్థాన పర్యవేక్షకులు డి.కిరణ్, ఉప ప్రధాన అర్చకులు నేరళ్ళ శ్రీనివాసాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ ఎ.శ్రీనివాస్, ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం కోశాధికారి జక్కు దేవేందర్ , మరియు తిరుమల సేవా గ్రూప్ సభ్యులు, కరీంనగర్, ధర్మపురి, లక్షెటిపేట్ సేవకులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, పురప్రముఖులు దేవస్థాన అర్చకులు & సిబ్బంది, భక్తులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. 30 జూన్ 2023 నుండి నేటి వరకు 6 అక్టోబర్ వరకు ఈ ఆదాయం.