👉 క్వింటాళ్ల కొలది బియ్యం, నెయ్యి, కాజు నిలువలు ?
👉 డిప్యూటీ కమిషనర్ ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూస్తున్న అవకతవకలు !
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దిట్టం సరుకుల వినియోగం లెక్కలు రికార్డులలో పక్కగా నమోదు చేసి ఉన్నప్పటికీ , గోదాంలో జరిగిన తనిఖీల్లో నిల్వలు అధికంగా ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా బియ్యం, నెయ్యి, కాజు, పంచదార తదితర సరుకులు భారీ మొత్తంలో నిలువలు ఉన్నట్టు చర్చ.
వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ డివిజన్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు , ఆధ్వర్యంలో బుధవారం అధికారులు ఆలయంలో ఆకస్మికంగా దాడులు జరిపి రికార్డులను, ప్రసాదాల, నాణ్యత ప్రమాణాలను, నిత్య అన్నదాన పథకం తదితర రికార్డులు తనిఖీ చేసిన విషయం తెలిసిందే.
ఏసీబీ తరహాలో తనిఖీలు ?
మంగళవారం కొండగట్టు క్షేత్రంలో బసచేసిన డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు, అధికారుల బృందం, బుధవారం నిర్మల్ దేవాదాయ శాఖ మంత్రి వద్దకు వెళుతున్నామని లీకు ఇచ్చి ఉదయం 8 -9 గంటల ప్రాంతంలో ధర్మపురి ఆలయం కు చేరుకుని. అధికారులు ఏ ఏ సెక్షన్లలో తనిఖీలు చేపట్టాలో ముందస్తుగా నోటు చేసుకున్న విధంగా అధికారులు ఆయా సెక్షన్లలో రికార్డులు తనిఖీలకు శ్రీకారం చుట్టారు. డిప్యూటీ కమిషనర్ ముందస్తుగా అన్నదాన ప్రాంగణం వైపు వెళ్తూ, వెంటనే వెనక్కి వచ్చి దిట్టం ( ప్రసాదాలు స్వామి వారికి నివేదనలు, భక్తులకు ఉచిత అన్నదానం అందించడానికి వినియోగించే సరుకులు నిలువ గోదాం) గదిలోకి వెళ్లి రికార్డులను సరుకుల నిలువలను దాదాపు రెండు గంటలకు పైగా పరిశీలించినట్లు సమాచారం.

రికార్డులలో సరుకుల వినియోగం లెక్కలు పక్కాగా నమోదు చేసి ఉండగా, సరుకుల నిలువలు క్వింటాల కొలది అధికంగా ఉండడంతో తనిఖీ అధికారుల బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం.
స్వామివారి నివేదనకు, భక్తులకు ప్రసాదాల అమ్మకాలకు, ఉచిత అన్నదానం లో నిబంధన మేరకు సరుకులు వినియోగించకపోవడంతోనే కాజు, పంచదార, నెయ్యి తదితర సరుకుల. నిలువలు అధికంగా ఉన్నట్టు, దీనికి తోడు ఆలయంలో నిత్యం 200 మంది భక్తులకు ఉచిత అన్నదానం అందించాలి. భక్తులకు 10 గంటల లోపే టోకెన్ లు పంపిణీ చేస్తారు. అయితే అన్నదానం టోకెన్లు పంపిణీ ఎక్కడ ? అనే సమాచారం అధిక సంఖ్యలో భక్తజనం తెలియదనే చర్చ. నిత్యం అన్నదాన రికార్డులలో దాదాపు 200 మంది భక్తులు భోంచేసినట్టు నమోదు చేయడంతో ఆకస్మిక తనిఖీలలో గోదాంలో సరుకుల నిలువలు బాగోతం వెలుగు చూసింది అనే చర్చ.

దాదాపు 70 మంది సిబ్బంది ఉన్న యమధర్మరాజు ఆలయ టికెట్లు విక్రయాలు సెక్యూరిటీ గార్డులు చేయవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అనీ అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఆలయంలో అత్యవసర పనుల నిర్వహణ కోసం అదనంగా రోజువారి కూలీలను నియమించుకొని డబ్బులు చెల్లింపుల వివరాలు, చెల్లింపుల ఓచర్లను తనిఖీలలో నిశితంగా పరిశీలించినట్లు సమాచారం. ఓ రికార్డు పుస్తకంలో ఓ ఉద్యోగి సంతకం చేయడానికి తనిఖీ సమయంలో సిద్ధం కాగా అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం.
ఈ తరహాలో తనిఖీలు సీఎం ఓ కార్యాలయ ఆదేశాలా ? దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలా.? డిప్యూటీ కమిషనర్ కు భక్తులు చేసినా ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారా ? అనే అంశంపై ఆలయ ఉద్యోగులు తర్జనభజన పడుతున్నట్టు సమాచారం.