👉మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో..
J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక న్యూ టిటిడి కళ్యాణమండపం లో ఉచితంగా వైద్య శిబిరం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రమోద్ ముత్తినేని, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ రాజేష్ మామిడి, గైనకాలజిస్ట్ డాక్టర్ యు స్వాతి, దంత వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య మైదం, వారు వైద్య సేవలు అందించారు.

సీజనల్ వ్యాధులు బిపి, షుగర్ , మూత్ర పరీక్ష , రక్త పరీక్షలు, మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

దాదాపు 300 మందికి పైగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.