ధర్మపురిలో వైభవంగా దసరా నవరాత్రోత్సవములు !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవముగా ప్రారంభమైనవి.


వేదపండితులు, ఋత్వికులచే మహా సంతల్బము, పృద్వీకలశ, గణపతి పూజ, సృష్టిః పుణ్యహ వచనము, ఋత్విక్ వర్ణణము, అఖండ దీప స్థాపన, నవగ్రహ, వాస్తు, క్షేత్ర పాలక, యోగిని, అంకురారోపణ. మాతృక. సర్వతోభద్ర మండల పూజలతో ప్రధాన కలశ స్థాపనలు జరిగినవి. ఇందులో భాగంగా సప్తశతీ పారాయణము. అమ్మ వారికి చతుషష్టి పూజ, శ్రీ చక్రమునకు కుంకుమార్చన, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణలు జరిగినవి. మరియు కన్యకా, సువాసిని పూజలు జరిగినవి.

ఈ రోజు అమ్మ వారు “శైలపుత్రి” ఎరుపు రంగు చీరలో మల్లెపూలు, బిల్వపత్రి దండలు ధరించి భక్తులకు దర్శనం ఇచ్చినది..
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి ఎస్.శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ చైర్మెన్ ఇందారపు రామయ్య, సభ్యులు చుక్క రవి, గునిశెట్టి రవీందర్ , వేదపారాయణదారులు బొజ్జ రమేష్ శర్మ, సిహెచ్. ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, సిహెచ్. రమణయ్య, అర్చకులు ద్యావళ్ళ విశ్వనాథ శర్మ, బొజ్జ సంతోష్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ రాజగోపాల్ శర్మ మరియు అర్చకులు & సిబ్బంది. ఋత్వికులు నంబి అరుణ్ కుమార్, పాలెపు సందీప్ శర్మ, ద్యావళ్ళ సాయి శర్మ మరియు భక్తులు పాల్గోన్నారు.


ఊరేగింపు సేవ
శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు అశ్వవాహనం పై క్షేత్రంలో పురవీధులలో ఊరేగించారు. శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి షోడషోపచార జాజతో హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుపబడినవి.