👉నేడు బాలగోపాల్ అమారత్వం రోజు.
J.SURENDER KUMAR
అలుపెరుగని ఆర్తనాదాలు చేస్తూ, అణగారిన వర్గాల ప్రజలకు సైతం హక్కులు ఉంటాయంటూ వారికి, సమాజానికి, అండగా ఉంటూ హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు పోరాటం చేసిన హక్కుల యోధుడు డాక్టర్ బాలగోపాల్ .
ఆయన అమరత్వం పొంది నేటికీ 14 సంవత్సరాలైనా పౌర సమాజం ఆయన జయంతి, వర్ధంతి వేళలలో స్మరించుకోవడం మానవ హక్కులకు ఉల్లంఘన సందర్భంలోనూ బాలగోపాల్ పేరును, ఆయన పోరాటాలను ఆందోళనల ను, స్మరించుకోవడం చర్చించుకోవడం పౌర సమాజం కనీస బాధ్యతగా పరిగణిస్తుంది.
ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు బోరకని రాజయ్య, అదృశ్యం బూటక పు ఎన్కౌంటర్ ఉదంతాన్ని . వెలికి తీసి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మానవ హక్కుల మహానేత బాలగోపాల్..
పౌర హక్కులంటే బాలగోపాల్, బాలగోపాల్ అంటే పౌరుల హక్కులు అనే తరహాలో చరిత్ర పూటలలో స్థానం పొందిన ఓ యోగి డాక్టర్ బాలగోపాల్.
డాక్టర్ బాలగోపాల్ జయంతిని, వర్ధంతిని, ప్రభుత్వలు అధికారికంగా, నిర్వహించిన, నిర్వహించుకున్న ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు, హక్కుల రక్షణ కోసం మృత్యువు దేవత ముంగిట ముందుకు అనేకసార్లు వెళ్లి ప్రజల హక్కుల రక్షణ కోసం రాజీలేని పోరాటలు చేసి, ఈ పోరాటంలో నా ప్రాణాలు పోయిన వెనుకాడను అంటూ మృత్యు దేవత ఎదిరించి పోరాడిన యోధుడు డాక్టర్ బాలగోపాల్. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాడనేది సత్యం

భుజాన బట్ట సంచి, చింపిరి జుట్టు, రబ్బర్ చెప్పులు, బుడ్డి కళ్ళజోడు, సంచిలో డైరీ పెన్ను మాసిన బట్టలు, ఎప్పుడు ఆలోచిస్తూ ఆగిపించి, కనిపించే వేషధారణ ఆయనది. జగిత్యాల డివిజన్ తో బాలగోపాల్ కు హక్కుల పరంగా ఏనలేని అనుబంధం . దొంతపూర్ లో ఓ దళిత యువకుడిని (బోరకాని రాజయ్య) పోలీసులు అదృశ్యం చేసిన వివరాలను ఆయన టి ఎల్ ఎన్ రెడ్డి కమిషన్ కు ఫిర్యాదు చేసే వరకు దొంతపూర్ గ్రామానికి వచ్చేవరకు బయటి ప్రపంచానికి తెలియదు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రతి ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికల అందించిన నిస్వార్థ హక్కుల రక్షకుడు డాక్టర్ బాలగోపాల్. పోలీస్ హింసను, ఎన్కౌంటర్లను ఏ స్థాయిలో ఖండించాడో, అదే స్థాయిలో నక్సలైట్ల హింస చర్యలను, ప్రజా కోర్టులలో అమాయకులను హతమార్చడం తదితర సంఘటనలలో అదే తరహాలో నక్సల్స్ హింస చర్యలను, అమాయకులను హతమార్చడం లాంటి చర్యలను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన ధైర్యశాలి డాక్టర్ బాలగోపాల్. ఓ దశలో నాటి పీపుల్స్ వార్ అగ్రనాయకత్వం బాలగోపాల్ పై వారెంట్ జారీ చేసింది. అయినా బాలగోపాల్ వెనకడుగు వేయలేదు,
ఈ దశలో మేధావి వర్గాలైన పౌర సమాజం వార్ కేంద్ర కమిటీ, చర్యలను వ్యతిరేకిస్తూ బాలగోపాల్ కు సంఘీభావం ప్రకటించిన సందర్భం సమాజం కు విధితమే.
బాలగోపాల్ పై ఎన్నోసార్లు భౌతిక దాడులు జరిగినా వాటి గురించి ఆయన పట్టించుకోలేదు వాటి ప్రచారానికి ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. అక్టోబర్ 8, 2009 రాత్రి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో గుండెపోటుతో మృతి బాధాకర సంఘటన.