J.SURENDER KUMAR,
కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జువ్వడి నర్సింగరావు శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ శుక్రవారం కోరుట్ల కు ఆ పార్టీ అభ్యర్థిగా టికెట్టు కేటాయించడంతో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.

జువ్వడి స్వగ్రామం తిమ్మాపూర్ లో ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి మిఠాయి పంపిణీ చేశారు.

ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నర్సింగరావు ను ఘనంగా స్వాగతించారు. అర్చకులు వేద పండితులు జువాడి దంపతులను ఆశీర్వదించారు.
స్వామివారిని దర్శించుకున్న బీజేపీ అభ్యర్థి కుమార్ !.

బిజెపిఎస్సీ మోర్చా జాతీయ నాయకుడు, ధర్మపురి అసెంబ్లీ బిజెపి పార్టీ అభ్యర్థి సోగాల కుమార్, శనివారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ధర్మపురి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ కేంద్ర కమిటీ కుమార్ ను ఎంపిక చేసింది. బిజెపి శ్రేణులు కుమార్ ను ఘనంగా స్వాగతించారు.

ప్రత్యేక పూజ అనంతరం స్థానిక కర్నే అక్క పెళ్లి కళ్యాణమండపంలో కార్యకర్తల సమావేశంలో కుమార్ మాట్లాడుతూ వారికి దశ దిశ నిర్దేశించారు.