J.SURENDER KUMAR,
మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి కెసిఆర్ తో బీ ఫామ్ తీసుకున్న అనంతరం మొదటి సారిగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని మంత్రి దర్శించుకున్నారు.

బీఆర్ఎస్ లో చేరికలు !
ధర్మపురి మండలం నక్కలపేట గ్రామనికి చెందిన రుద్రసేన ధర్మపురి నుంచి దగడ్స్, మహాసేన యూత్ సభ్యులు భారీ సంఖ్యలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీలో చేరారు.

గొల్లపల్లి మండలం గంగదేవిపల్లి, రాఘవపట్నం గ్రామాల నుండి మాజీ యంపిటిసి బుర్ర రాజేందర్ గౌడ్, బిజెవైయం మండల ప్రాధాన కార్యదర్శి కాసాని గంగాధర్, బిజెపి బూత్ కమిటీ అధ్యక్షులు అంకం రాందాస్, బోయపోతు రాజ్, బుర్ర నరేష్, సింగదాసరి నాగరాజు తో

భారీ సంఖ్యలో యువకులు ,మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి వారికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.