ధర్మారం, వెలగటూర్ మండలలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం !

👉 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో..

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ ధర్మారం, వెలగటూర్ మండలం దొంగతుర్తి , రాంనుర్ గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని శుక్రవారం జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో జరిగింది.

ముందుగా గ్రామానికి చెందిన యువకులు భారీ సంఖ్యలో లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ఎమ్మెల్యేగా, విప్ గా, మంత్రిగా, రాజ్యం ఏలిన కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి అంటు ఏమి లేదని, పలు ఆరోపణలు చేశారు. ప్రజలంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్, మండల బిసి సెల్ అధ్యక్షులు అశోక్, రవి, శ్రీనివాస్, ఆశాలు, ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు


కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్, వార్డు సభ్యులు!


వెలగటూరు మండలం రాంనూర్ గ్రామ సర్పంచ్ మంజుల గంగయ్య, గ్రామానికి చెందిన భారీ సంఖ్యలో యువత గ్రామస్థులు,అదే విధంగా ముత్తునూర్ గ్రామానికి చెందిన వార్డ్ సభ్యులు లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, రాంనూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టారు..
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
,కలెక్టర్ శరత్ పుణ్యమా అని ఎమ్మెల్యే గద్దె మీద కూర్చున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి అంటు ఏమి లేదని ఆరోపించారు.


ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, ఎంపిటిసి మంజుల, సర్పంచ్ మురళి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు మహేందర్,.మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కుశనపల్లి లక్ష్మీ, యూత్ ప్రెసిడెంట్ ఎనగందుల గణేష్, జనరల్ సెక్రటరీ పొరండ్ల వెంకటేష్,ఎస్సీ సెల్ అధ్యక్షులు కుశనపల్లి బక్కయ్య, బిసి సెల్ అధ్యక్షులు రామరాజు, ఉప సర్పంచ్ సందీప్ వెంకటేష్, రమేష్,తిరుపతి, గెల్లు శ్రీనివాస్, వెంకటేష్, వెంకట స్వామి, శశి,.రాకేష్,.హరీష్ తదితరులు పాల్గొన్నారు