జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ !
J. SURENDER KUMAR,
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జిల్లా లో ఈనెల 12, 13న జరుపనున్నట్లు జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు.
ఎస్పీ కార్యాలయము సోమవారం జారీ చేసిన ప్రకటనలు వివరాలు ఇలా ఉన్నాయి.
👉 జిల్లా కేంద్రం ధరూర్ క్యాంప్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా గల ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నారు.
👉 అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్ మరియు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సూచించిన విధంగా అభ్యర్థులు ఆన్లైన్లో అటేస్టేషన్ ఫారం తీసుకోవాలి.
👉 TSLPRB వెబ్ సైట్ లో అభ్యర్థుల లాగిన్ లో వెబ్ టెంప్లేట్ రూపంలో ఈ ఫామ్ అందుబాటులో ఉంటాయి.
వీటిని డిజిటల్ గా పూర్తి చేసిన తర్వాత మూడు సెట్లు A 4 సైజ్ పేపర్ పై ప్రింట్ తీసుకొని అభ్యర్థులు సంతకాలు చేసి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అతికించాలి,
👉ఈ ఫామ్, సర్టిఫికెట్స్ జిరాక్స్ లపై గెజిటెడ్ ఆఫీసర్ తో ధృవీకరణ సంతకం తీసుకోవాలి.
👉12 న తేదీన సివిల్ మరియు ఏఆర్ కు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ !
👉13 న TSSP, ఫైర్ , ఎక్సైజ్, IT&C, ట్రాన్స్పోర్ట్ కు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్! అభ్యర్థులు తాము ఎంపికైన పోస్ట్ ప్రకారం సంబంధిత తేదీల్లో హాజరై పోలీసు వారి సలహాలు సూచనలు పాటిస్తూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.

👉 అన్ని ధ్రువీకరణ పత్రాలు మూడు సెట్లు అందించాలి!
👉 All the Documents to be submitted in
3 sets as per their selection Post
👉 Attestation forms in 3 sets.
👉 Bona fide/ School Study certificates ( from 1st to 7th classes)
👉 Residence Certificate issued by the MRO/Tahsildar ( for the Candidates who did not study in the School)
👉 Community Certificate
👉 Non –Creamy layer Certificate ( for BC Candidates)
👉 Economically Weaker Section Certificates ( for OC Candidates)
👉 ABO ST Certificate ( Agency Area Certificate)
👉 SSC or matriculation certificate or Equivalent Certificate
👉 Educational Qualification Certificates for relevant Posts
👉 PPO/Discharge Book for Ex-Servicemen Candidates.
👉 Service Certificate ( in case of Telangana State Government Employee)
👉 Special Categories like NCC, CPP, CDI, HG, CSPF, CJP
👉 MSP certificate (Category –I, II, III) and other relevant certificates as per their selection