ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాలి!

కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా !


J.SURENDER KUMAR,

ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారమే అధికారులు ఉద్యోగులు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాసిన్ భాష అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఆయా అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని నియమ నిబంధనలను వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై
ఎన్నికల కమీషన్ ఆయా జిల్లా ఎన్నికల అధికారులకు ఇటీవల సమావేశం నిర్వహించి సమీక్షించడం జరిగిందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, నియమావళిని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించాలని అన్నారు.

శిక్షణ కార్యక్రమాలలో వివరించిన అంశాలను నియోజకవర్గాలలో జరిగే శిక్షణ తరగతులలో ఆయా టీం లకు పూర్తీ వివరాలతో వివరించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా నిర్వహించే విధంగా ఎన్నికల యంత్రాంగాన్ని సమాయాత్తం చేయాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమాలను మరిన్ని నిర్వహించి ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను వివరిస్తామని తెలిపారు. శిక్షణ తరగతుల సమయంలో అందించిన రూల్స్, ఇతర అంశాలకు సంబంధించిన పుస్తకాలను అందించడం జరుగుతుందని, వాటిని తప్పనిసరిగా పఠనం చేసి సిద్దంగా ఉండాలని సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. తిరుపతి, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు, ఎం.పి.డి.ఓ.లు, కే. నవీన్ కుమార్, డి. సంతోష కుమార్, అసెంబ్లి నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు.