👉 సీజ్ చేసిన నగదు, విడుదల చేసే డబ్బు వివరాలు మీడియాకు తెలపాలి !
👉 ఉల్లంఘనల పై ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి !
👉 ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ !
J.SURENDER KUMAR,
ఎన్నికల సమయంలో నిర్వహించే తనిఖీల్లో నగదు, బంగారం సీజ్ చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై క్షేత్రస్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు. నగదు సీజ్ చేసే సమయంలో సంబంధిత వ్యక్తులకు సీజ్ చేస్తున్న నగదు, బంగారం వివరాలు, ఎక్కడ అప్పీల్ చేయాల్సి ఉంటుంది అనే అంశాలను తెలియజేస్తూ రశీదు తప్పనిసరిగా అందించాలని అన్నారు.
శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర డీజీపీ అంజని కుమార్, ఇతర రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎం.సి.ఎం.సి., నగదు, బంగారం పట్టివేత, సి విజల్ యాప్, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.

ఎన్నికల అధికారి మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించా లని, రాజకీయ పార్టీల, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులకు తప్పనిసరిగా తీసుకున్న చర్యలపై లిఖిత పూర్వక సమాధానం అందించాలని సూచించారు.
👉 సువిధ యాప్
ఎన్నికల ప్రచారం సంబంధించిసమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి సువిధ యాప్ ద్వారా, ఆఫ్ లైన్ లో వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని, క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల ప్రచారంలో వినియోగించే ఆడియో, వీడియోలను పరిశీలించి ఎం.సి.ఎం.సి. ధృవీకరించాలని, ప్రతి రోజూ ఎం.సి.ఎం.సి., సువిధ యాప్, అఫ్ లైన్ దరఖాస్తులపై ఎన్నికల అధికారి దృష్టి సారించాలని అన్నారు.
👉 అప్పీల్ అడ్రస్ తెలపాలి!
ఎన్నికల సమయంలో నిర్వహించే తనిఖీల్లో నగదు, బంగారం సీజ్ చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై క్షేత్రస్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు. నగదు సీజ్ చేసే సమయంలో సంబంధిత వ్యక్తులకు సీజ్ చేస్తున్న నగదు, బంగారం వివరాలు, ఎక్కడ అప్పీల్ చేయాల్సి ఉంటుంది అనే అంశాలను తెలియజేస్తూ రశీదు తప్పనిసరిగా అందించాలని అన్నారు.
సీజ్ చేసిన బంగారం, నగదు 10 లక్షల కంటే తక్కువైతే వెంటనే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కు అప్పగించాలని, 10 లక్షల కంటే ఎక్కువ నగదు సీజ్ చేస్తే ఐటీ అధికారులకు అప్పగించాలని అన్నారు. సదరు నగదుపై వచ్చే అపీల్ లను సంబంధిత గ్రీవెన్స్ సెల్, ఐటీ అధికారులు పరిశీలించి నిబంధనలు, ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారని అన్నారు.
👉 మీడియాకు తెలపాలి!
ఎన్నికల సమయంలో మనం సీజ్ చేసే నగదు, బంగారం, మధ్యం, ఇతర విలువైన అభరణాల గురించి మీడియాకు సమాచారం అందించాలని, అదే విధంగా సంబంధిత వ్యక్తులు చేసిన అప్పీల్ అనంతరం విడుదల చేసే నగదు వివరాలు సైతం ప్రెస్ కు అందించాలని, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదిక నిర్ణిత నమూనాలో సమర్పించాలని అన్నారు.
👉 ప్రతి తనిఖీ వీడియో రికార్డ్ చేయాలి !
ఎన్నికల విధులు నిర్వహించే ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలతో పాటు తప్పనిసరిగా వీడియో కెమెరా సౌకర్యం ఉండాలని, ప్రతి తనీఖీ వీడియో కెమేరాలో రికార్డు చేయాలని అన్నారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వల్ నరబుల్ పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. వల్ నరబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించే సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించే ఫిర్యాదులను సైతం దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు.
👉 ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలి !
జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని , సామాజిక మాధ్యమాలలో ఎన్నికల నిర్వహణపై వస్తున్న వదంతులు, అపోహలను నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించా లని అన్నారు.
👉 అనుక్షణం అప్రమత్తంగా ఉండండి
కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష !
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, ఎన్నికల తనిఖీ టీమ్ లు అప్రమత్తంగా ఉండి, అక్రమంగా రవాణా చేస్తున్న నగదు, మద్యం, సరుకులను పట్టుకొని సీజ్ చేయాలని అన్నారు. పండుగల సీజన్ నేపథ్యంలో ఎక్కువగా రవాణా అయ్యే ఆస్కారం ఉంటుందని సూచించారు. జిల్లా సరిహద్దు లో గల చెక్ పోస్టులలో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. మాడల్ కోడ్ టీమ్ లు నిశిత పరిశీలనలు నిర్వహించాలని అన్నారు. సువిధ యాప్ ద్వారా సంభందిత అనుమతులు పొందాలని, అనధికార పత్రాలు లేని డబ్బు, సరుకులను రవాణా చేయొద్దని ప్రజలకు తెలియ జేయాలని అన్నారు.
ఈ సమావేశంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఆర్డీఓ రాజేశ్వర్, నరసింహ మూర్తి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.