జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా !
J.SURENDER KUMAR,
శాసన సభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో స్ట్రాంగ్ రూం లను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా గురువారం రోజున జగిత్యాల నియోజక వర్గము నకు సంబంధించిన వి.ఆర్.కే. కళాశాలలో ప్రతిపాదిత ఓట్ల లెక్కింపు కేంద్రం, మినీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూం, ధర్మపురి నియోజక వర్గము నకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

ఆయా స్ట్రాంగ్ రూంలలో అవసరమైన పనులు చేపట్టాలని, స్ట్రాంగ్ రూం ల ముందు సిసి కెమెరాలు, విద్యుత్ లైట్స్, తదితర ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. అవసరమైన బారికేడింగ్ చేయించాలని అన్నారు. స్ట్రాంగ్ రూం లకు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, దివాకర, ఆర్డీవోలు నరసింహ మూర్తి, రాజేశ్వర్, పోలీసు, రెవిన్యూ, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు, మునిసిపల్ కమిషనర్ లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.