J.SURENDER KUMAR,
తెలంగాణా రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు -2023 ప్రక్రియలో భాగంగా జగిత్యాల జిల్లాలోని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుండి మినహాయించాలని గురువారం PRTUTS జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
👉 దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులను
👉 గర్భిణీ & చంటి పిల్లల తల్లులుగా ఉన్న ఉపాధ్యాయినిలు, మెటర్నిటీ సెలవుపై ఉన్న ఉపాధ్యాయినిలను
👉 6 నెలలలోపు పదవీ విరమణ చేయబోయే ఉపాధ్యాయులను

నవంబర్ 30న జరుగబోయే శాసనసభ ఎన్నికల విధుల నుండి మినహాయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. వినతి పత్రాన్ని కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హన్మంత రావుకు అందించారు.