👉 గల్ఫ్ ఓటు బ్యాంకు పై చర్చ ..
J.SURENDER KUMAR,
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల రోజైనా సోమవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో తీన్మార్ మల్లన్న హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
జగిత్యాలకు చెందిన గల్ఫ్ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి ఈ సమావేశ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. గల్ఫ్ దేశాలలో ఉన్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ‘ఒక కోటి గల్ఫ్ ఓటు బ్యాంకు’ గా మారుతున్న విషయాన్ని భీంరెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావించారు.