ఫ్లాష్. ధర్మపురి ఆలయంలో అధికారుల ఆకస్మిక తనిఖీలు !

👉 గంటల తరబడి రికార్డులు, ఓచర్లు తనిఖీలు!


👉 ప్రసాదాల  గోదాంలో సరుకుల శాంపుల్స్ పరిశీలన!


👉 ప్రసాదాల నాణ్యత, ప్రమాణాలు, స్టాక్ పరిశీలన!


👉 ఉద్యోగుల్లో దడ పుట్టిస్తున్న డీ .సి దాడులు!


J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రంగా సాలిన కోట్లాది రూపాయల ఆదాయం గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం వరంగల్ డివిజన్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు , ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆకస్మికంగా దాడులు జరిపి రికార్డులను తనిఖీ చేశారు.  ఉదయం తొమ్మిది గంటలకు ఆలయానికి చేరుకున్న ఆరుగురు సభ్యులు గల బృందం లో ఒకరు అన్నదాన మరో అధికారి ప్రసాదాలు తయారు చేసే సరుకుల నిల్వ ఉండే గోదాంలోకి, మరో అధికారి ప్రధాన ఆలయంలోని టికెట్లు ప్రసాదాల అమ్మకాల కౌంటర్లను తనిఖీ చేశారు. మరో అధికారి యమధర్మరాజు ఆలయం రికార్డులను పరిశీలించారు.  ఉద్యోగుల జై బోలో నగదు. క్యాష్ కౌంటర్లో నగదును. టికెట్రా విక్రయాలు ప్రసాదాలు అమ్మకాల మొత్తం నగదును రీచేక్ చేసుకున్నట్లు సమాచారం. సాయంత్రం 6 గంటల వరకు తనిఖీలు జరిగినట్టు సమాచారం.

కొన్ని కీలక వివరాలను సెల్ఫోన్లో తీసుకుంటున్న డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు


ఎలాంటి సమాచారం లేకుండా కేవలం 20 నిమిషాల ముందు వరంగల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. సమాచారం రావడంతో ఆలయ  ఉద్యోగులలో కొందరు కొలిక్కిపడ్డట్టు సమాచారం.  స్వామివారిని దర్శించుకున్న అధికారి. లడ్డు, పులిహోర, ప్రసాదాల నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారని పరిశీలించారు. గోదాంలో ఉన్న సరుకుల ( ప్రసాదాల తయారీకి ఉచిత అన్నదానానికి స్వామివారి నైవేద్యానికి వినియోగించే సరుకులు ). టెండర్ సమయంలో టెండర్ దారుడు ఆలయానికి సరఫరా చేసే సరుకుల  శాంపిల్స్ ను, గోదాంలో ఉన్న సరుకులను తనిఖీ చేసినట్టు సమాచారం. 

ప్రసాదాల తయారీ సరుకుల గోదాంలో తనిఖీలు

స్టాక్ రిజిస్టర్ తో పాటు. నిల్వ ఉన్న సరుకులు, తూకం వేసి వివరాలను నమోదు చేసుకున్నట్టు సమాచారం.
కార్యాలయంలో రికార్డులను, ఆదాయ, ఖర్చుల నమోదు రికార్డులు,  ఓచర్లు, బ్యాంకు నిలువలు, దాతలు ఇచ్చిన విరాళాలు వివరాలు, ప్రత్యేకంగా ఉచిత అన్నదానం రికార్డుల మెయింటెనెన్స్ పరిశీలించినట్లు సమాచారం. ఆలయ ఉద్యోగులను ఎవరు ఏ సెక్షన్ లో విధులు నిర్వహిస్తారు అని ఉద్యోగి హోదా పేరును డిప్యూటీ కమిషనర్ వివరాలు సేకరించినట్టు సమాచారం.

ప్రధాన ఆలయంలో టికెట్ల విక్రయాలను తనిఖీ చేస్తున్న దృశ్యం


రికార్డుల నమోదు చేసిన కొన్ని కీలక వివరాలను అధికారి పరిశీలించి రికార్డు పుస్తకాల్లో నమోదైన  కొన్ని వివరాలను తన సెల్ ఫోన్లో చిత్రీకరించినట్టు తెలిసింది. రికార్డుల, గోదాములు, తనిఖీ సమయంలో  ఉద్యోగులు సిబ్బంది ఇతర ఉద్యోగులను కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నట్టు సమాచారం. ఉద్యోగుల సమయపాలన హాజరు పట్టికలో సంతకాలు లేకపోవడం గుర్తించినట్టు తెలిసింది. భక్తులకు అందించే అన్నదానం నాణ్యత ప్రమాణాలు గుర్తించేందుకు డిప్యూటీ కమిషనర్ తో పాటు తనిఖీ చేపట్టిన అధికారుల బృందం. భోంచేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా నేయి నాణ్యత ప్రమాణాలపై అధికారి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

యమధర్మరాజు ఆలయంలో టికెట్ల తనిఖీ


వరంగల్ డివిజన్ దేవాదాయ  డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు పట్ల ఉద్యోగులలో సదా అభిప్రాయం ఉంది. ముక్కు సూటిగా, అవినీతికి ఆమడ దూరంలో  ఉంటారని, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని గుర్తింపు ఉంది. పైరవీలు, రాజకీయ ఒత్తిడి డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు దగ్గర పని చేయవనే చర్చ ఉద్యోగ వర్గాల్లో ఉంది.
అధికారుల తనిఖీ  పర్యావసనం ఎలా ఉంటుందో అని ఆలయ ఉద్యోగులు కొందరు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.