గడప గడపకు కాంగ్రెస్..లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో చేరికలు!

J.SURENDER KUMAR,

ధర్మపురి మండలంలోనీ చిన్ననక్కల పేట, పెద్ద నక్కల పేట, దోనూర్, బూరుగుపల్లి గ్రామాల్లో శనివారం డిసిసి అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్, ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన యువకులు, మహిళలు భారీ సంఖ్యలో లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి  ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
ఎమ్మెల్యే గా, విప్ గా, మంత్రి హోదాలో  కొప్పుల ఈశ్వర్ , ధర్మపురి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి అంటు ఏమి లేదని, మిల్లర్ల చేతిలో ఈ ప్రాంత రైతాంగం దోపిడీకి గురవుతున్న మంత్రి  స్పందించడం లేదని సాగు తాగు నీటి తదితర సమస్యలపై ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ₹ 5.వందలకే సిలిండర్, రైతులకి మద్దతు ధరతో పాటు, క్వింటాలుకు అదనంగా ₹500 రూపాయల సహాయం,.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ప్రతి మహిళకు చేయూత కింద ₹4వేల రూపాయల ఆర్థిక సహాయం, రేషన్ కార్డులను పంపిణీ నిరంతరంగా కొనసాగింపు, ఇంటి నిర్మాణం కోసం ₹5 లక్షల ఆర్థిక సహాయం, రైతులకు ప్రతి సంవత్సరం ₹15 వేల రూపాయలు, కౌలు రైతులకు ₹12 వేల రూపాయల ఆర్థిక సహాయం తదితర గ్యారెంటీలను వివరించారు.


ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందెని మొగిలి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీయొద్దిన్, నర్సింహులు, పురుషోత్తం, మాజి ఎంపిటిసి దొమగొండ శంకరయ్య, వడ్లూరి సత్యం, శ్రీహరి, బాదినేని వెంకటేష్,.శేఖర్, వినయ్, చొప్పరి వంశీ,

సామ్యూల్, మామిడి ప్రశాంత్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, చిట్యాల లక్ష్మి,వార్డు మెంబర్ పెద్దన్న ,  పొడేటి ఉపేందర్, చిన్న వెంకటి, రాసర్ల చందు, మెడి సురేష్, దాసరి రమేష్, మారంపెల్లి మల్లయ్య, గణేష్, ప్రశాంత్, రాజు, మధు, శరత్ మరియు రుద్ర సేన యూత్ సభ్యులు కొదురుపాక శ్రీనివాస్, చిట్టుమల్ లక్ష్మణ్  గంగరాం, రాయమల్లు, రాజేష్, రమేష్ రజినీకాంత్, కమలాకర్,.శరత్, శేఖర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు