J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణoలోని గంగపుత్ర ఆధ్వర్యంలో సోమవారం బొడ్డెమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ వేడుకలను గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ బొడ్డెమ్మ ను స్త్రీలు పెళ్లి కాని వారికి మాత్రమే ఎత్తడం జరుగుతుందని వారు తెలిపారు. అలా ఎత్తిన మహిళ కూ సంవత్సరం వెళ్లే లోపు పెళ్లి జరుగుతుందని ఒక ఆనవాయితీగా వస్తోందని, బొడ్డెమ్మ పై పెట్టె గౌరమ్మ ను పిల్లలు కానీ స్త్రీలు ప్రసాదంగా స్వీకరిస్తే తప్పక పిల్లలు కలుగుతారని వీరియొక్క నమ్మకం .
ఈ వేడుకలకు ఇతర ప్రాంతాలు వలస వెళ్లిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కొప్పుల నందిని హాజరై మాట్లాడుతూ ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి అని, గంగపుత్ర సంఘం మహిళలతో బొడ్డెమ్మ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ సంగి సతెమ్మ, జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, కౌన్సిలర్ గరిగే అరుణ, సంఘం సభ్యులు గడప గంగారాం, గజ్జి మల్లేష్, మాజీ వర్డ్ సభ్యులు బాకీ శేఖర్, కాశావేణి శ్రీనివాస్, బిఅరెస్ నాయకులు సంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.