గ్రామాల్లో గడపగడప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం!

👉 లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో..


J.SURENDER KUMAR,

ధర్మారం మండలం కటీకనపల్లి,, ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామాలలో మంగళవారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.
మండల నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరికలు !


ఈ సందర్భంగా కటికనపల్లి గ్రామ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బొనగిరి శ్రీనివాస్, మరియు ముదిరాజ్ సంగం ఆద్వర్యంలో భారీ సంఖ్యలో యువకులు, గ్రామస్థులు లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


ఈ సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వం, మంత్రి కొప్పుల ఈశ్వర్ పై లక్ష్మణ్ కుమార్ పలు ఆరోపణలు చేశారు.
ధర్మపురిలో చేరికలు !


దమ్మన్నపేట గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో జక్కుల తిరుపతి, చిపిరిశేట్టి వెంకన్న, మైదం వెంకటేష్, ముత్యాల తిరుపతి, కాంగ్రెస్ పార్టీలో చేరారు.


అనంతరం ధర్మపురి లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గార్డెన్స్ లో ధర్మపురి పట్టణం కు చెందిన భారీ సంఖ్యలో యువకులు యువత లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందెని మొగిలి,

దమ్మన్నపేట ఎంపిటిసి గంగాధర్, టౌన్ యూత్ ప్రెసిడెంట్ అప్పం తిరుపతి, NSUI అసెంబ్లీ అధ్యక్షులు అప్పం శ్రవణ్, టౌన్ బిసి సెల్ అధ్యక్షులు వొజ్జల లక్ష్మణ్, సుముక్, ఆశెట్టి శ్రీనివాస్, కశేట్టి రాజు, గోపి, ప్రశాంత్, నిరంజన్, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు