గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం!

లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో..


J.SURENDER KUMAR,

ధర్మపురి మండలం ఆరేపల్లి, తీగల ధర్మారం గ్రామాల్లో శనివారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.


ముందుగా గ్రామంలోని హనుమాన్, శివాలయ ఆలయాలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.


ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ రాచరిక పాలనను కొనసాగిస్తూ, దళిత ముసుగులో నియంతల వ్యవహరిస్తున్నారని, కలెక్టర్ శరత్ పుణ్యమా అని ఎమ్మెల్యే గద్దె మీద కూర్చున్న కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి లేదని, ఆరోపించారు.


సంతలో ప్రచారం!


ధర్మపురి పట్టణంలో జరుగుతున్న శనివార సంతలో లక్ష్మణ్ కుమార్ , కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విక్రయదారులను, కొనుగోలుదారులను కలిసి. కాంగ్రెస్ కు. ఓటు వేసి గెలిపించాల్సిందిగా సంతలో ప్రచారం చేశారు.


చేరికలు!


మండలంలోని. జైన, కమలాపూర్, దమ్మన్నపేట, ఇందిరమ్మ కాలనీ (నక్కలపేట రోడ్), వెల్గటూర్ మండలం, అంబరిపేట గ్రామాలకు చెందిన చెందిన భారీ సంఖ్యలో యువకులు ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ క్యాంప్. కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువాలు పార్టీలోకి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. అనంతరం వీరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందేని మొగిలి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు నర్సింహులు, ఆరెపల్లి గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు మల్లేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు భుమేశ్, తిరుపతి, లక్ష్మణ్, రాజేందర్, అశేట్టి శ్రీనివాస్, సుముక్, సాయి ప్రశాంత్,.మధు, శంకర్ చంద్ర కాంత్, కాశేట్టి రాజు, గోపి, శ్రీహరి, బుచ్చిరెడ్డి, ప్రశాంత్, భరత్, రాజ్ కుమార్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.