👉 కొరడా విదిల్చిన ఎన్నికల కమిషనర్ !
J.SURENDER KUMAR,
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికలపై నిఘా పెట్టింది.రాష్ట్రంలోశాసనసభ ఎన్నికల వేళ పలు జిల్లాల కలెక్టర్లు, పోలిస్ కమిషనర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
ఇటీవల హైదరాబాద్‌లో సమీక్ష అనంతరం అధికారుల పనితీరు, వారిపై వచ్చిన ఫిర్యాదులు, గత అనుభవాలు, తదితరాలను దృష్టిలో పెట్టుకొని ఈసీ అధికారులను బదిలీ చేసింది. డబ్బు, మద్యం, ఇతరత్రాల పంపిణీ, మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా వచ్చిన ఫిర్యాదులు సహా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది.
👉 రంగారెడ్డి కలెక్టర్ హరీశ్,
👉 మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్,
👉 యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,
👉 నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డిలపై
ఈసీ బదిలీకి ఆదేశించింది.
👉 అలాగే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్,
👉 వరంగల్ సీపీ రంగనాథ్,
👉 నిజామాబాద్ సీపీ వివి సత్యనారాయణ 👉 రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు,
👉 వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, 👉ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీ
👉 జిల్లాల నాన్‌కేడర్ ఎస్పీ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
👉 జగిత్యాల : ఎగ్గడి భాస్కర్,
👉 సంగారెడ్డి: రమణకుమార్,
👉 కామారెడ్డి: శ్రీనివాసరెడ్డి.
👉 మహబూబాబాద్ : చంద్రమోహన్,
👉 జోగులాంబగద్వాల : సృజన
👉 సూర్యాపేట : రాజేంద్రప్రసాద్,
👉మహబూబ్‌నగర్ : నర్సింహ,
👉 నాగర్ కర్నూల్ : మనోహర్,
👉 నారాయణపేట : వెంకటేశ్వర్లు,
👉 భూపాలపల్లి : కరుణాకర్,
👉 గురువారం సాయంత్రంలోగా నివేదిక పంపించండి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉన్న ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలకు విడిగా ముఖ్య కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశించింది. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని స్పష్టం చేసింది. ఆయా స్థానాల్లో కొత్త అధికారుల నియామకం కోసం గురువారం సాయంత్రంలోగా ప్యానల్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లను సీఈఓ ద్వారా ఈసీకి పంపాల్సి ఉంటుంది. కాగా.. అందులో ఒకరిని కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది.
ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు పలువురి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ.. వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే.